రాముడు విభీషణుని చూచి ఇలా అన్నాడు విభీషణ! నీవు లంకను ధర్మమును అనుసరించి పాలించు. నీకు ధర్మము అధర్మము గురించి నేను చెప్ప పనిలేదు. నీ సోదరుడు కుబేరుని I ఆదరంతో చూచుకో. లంకా నగరంలోని నీ ప్రజలను ఆదరంతో పాలించి ఏ సమయంలో కూడా నీ బుద్ధిని పెడతోవ పట్టనీయకు. అధర్మం జోలికి వెళ్లకు. రాజసుఖములలో పడి నన్ను, సుగ్రీవుని మర్చిపోవద్దు.” అని విభీషణుడికి హితోపదేశము చేసాడు రాముడు.రాముని మాటలు విన్న రాక్షసులు వానరులు రాముని ఎంతగానో ప్రశంసించారు.
ఆ సమయంలో హనుమంతుడు రామునికినమస్కరించి ఇలా అన్నాడు. “ రామా! నా మనసు, రుద్ది ఎల్లప్పుడూ నీ మీదనే ఉండేటట్టు నన్ను అనుగ్రహించు. రామ చరిత్ర ఈ లోకంలో ప్రచారంలో ఉన్నంత కాలము నేను జీవించి ఉండేటట్టు నాకు వరం ప్రసాదించు. నేను నిరంతరమూ నీ నామము, నీ చరిత్రను జపిస్తూనే ఉంటాను. వింటూ ఉంటాను,పాడుతూ ఉంటాను. రామ నామాన్ని జపిస్తూ, రామ చరితను వింటూ నా బాధలను, కష్టాలను మరిచిపోతాను. నిత్యం సంతోషంగా ఉంటాను” అని ఆర్తితో అంటున్న హనుమాన్ చూచి రాముడు తన సింహాసనము నుండి లేచి వచ్చి హనుమను గట్టిగా కౌగలించుకున్నాడు. “హనుమ! నీవు కోరిన విధముగా అన్నీ జరుగుతాయి. సందేహము లేదు. రామ కథ ఈ లోకంలో ఎంతకాలము నిలిచి ఉంటుందో అంతకాలము నీ కీర్తి నిలిచి ఉంటుంది.
అంత కాలము నీవు చిరంజీవిగా ఉండగలవు. రామ కథ సూర్య చంద్రులు ఉన్నంత కాలము ఈ లోకంలో నిలిచి ఉండగలదు. హనుమ చేయడం అంటే నిన్ను, నీవు చేసిన ఉపకారములను అవమాన ఉపకారములను నాలోనే జీర్ణం చేసుకుంటాను. నీకు జీవితాంతము నీవు నాకు చేసిన ఉపకారములకు ఒక్కొక్కదానికీ నా ప్రాణములు ఇచ్చినా సరిపోదు. అప్పుడు మిగిలిన ఉపకారములకు నేను ఏమి ఇవ్వగలను. నీవు నాకు చేసిన ఉపకారములకు ప్రత్యుపకారము పరచడమే అవుతుంది.
అందుకని నీవు నాకు చేసిన ఋణపడి ఉంటాను” అని అన్నాడు రాముడు. వెంటనే తన మెడలోని రత్త హారమును తీసి హనుమ మెడలో వేసాడు.తరువాత వానర వీరులు అందరూ రామునికి నమస్కరించి కిష్కింధకు బయలుదేరారు. సుగ్రీవుడు, విభీషణుడు, హనుమంతుడు రాముని విడువ లేక విడువ లేక విడిచి వెళ్లారు. వారి ఆత్మలన్నీ రామునివద్దనే విడిచి పెట్టి కేవలం వారి దేహములు మాత్రమే అయోధ్యను విడిచిపెట్టి వెళ్యాయి.
వారందరూ రామునికి నమస్కారములు చేసి తమతమ గృహములకు వెళ్లిపోయారు. పట్టాభిషేక మహోత్సవాన్ని వచ్చిన వారందరూ వెళ్లిపోయారు. రాముడు పరిపాలనా కార్యములలో నిమగ్నం అయ్యాడు. ఒక రోజు రాముడు తన మందిరము పైభాగం మీద కూర్చొని తన తమ్ములతో మాట్లాడుతూ ఉంటే ఆకాశంలో పుష్పక విమానము కనిపించింది,పుష్పకములో నుండి మాటలు వినిపించాయి.
Here you can download the వాల్మీకి రామాయణం సమాధానం PDF / Valmiki Ramayana Uttara Kanda Telugu PDF by click on the link given below.